cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

మన మంచి పుస్తకం

Show more
Sri Lanka747The language is not specifiedBooks5 162
Advertising posts
5 243
Subscribers
+924 hours
+447 days
+17130 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

దళితులు,ఆదివాసీలు,ఒబీసీలు, బ్రాహ్మణులు, ముస్లింలు,హిందువులు,సిక్కులు, మహిళలు, పురుషులు,పిల్లలు,అనేక భాషలు,భిన్న సంస్కృతుల గల వారెందరో పోరాటంలో పాల్గొన్నారని,అలా పోరాడి బతికున్న అనేక మంది మనోభావాలను, పోరాట సంఘటనలను, దృశ్యాలను ఎంతో ఆసక్తిగా కథనాత్మకంగా నమోదు చేసిన పుస్తకం ‘ఆఖరి యోధులు’.అందరూ గుండెకు హత్తుకోవాల్సినది. గొప్ప అనుభూతిని నింపుతుంది. @నవతెలంగాణ దినపత్రిక ఎడిటోరియల్
Show all...
*ఆఖరి యోధులు* (స్వతంత్ర పోరాట పదాతి సైనికులు) *రచయిత : పాలగుమ్మి సాయినాథ్* *అనువాదం :ఎస్.వినయ్ కుమార్* *ధర_రూ275 కాపీ_కోసం 94900 98654* *ఇది ప్రజల స్వాతంత్ర్య పోరాట చరిత్ర - ప్రొఫెసర్ జగ్ మోహన్* 'The Last Warriors'‘విప్లవానికి మహాపురుషులే కారణంగా కన్పిస్తుంటారు. కానీ నిజమేమిటంటే, ప్రజలే స్వయంగా విప్లవానికి కారణం’ ఈ మాటలు 1931లో ఎరవాడ జైలు నుండి ఎం.కె.గాంధీ రాసిన లేఖలోని వాక్యాలు ‘ప్రజలే చరిత్ర నిర్మాత’లని మార్క్స్‌ చెప్పిన విషయాన్ని రుజువు చేస్తున్నాయి. నాయకులు అవసరమే కాదు ముఖ్యం కూడా.కాని ఉద్యమ నిర్మాణంలో పునాది మాత్రం సాధారణ ప్రజలే. ఈ సాధారణ సామాన్య ప్రజల బాధలగాధల గుర్తింపే నిజమైన చరిత్ర. గతం కేవలం జరిగిపోయిన చరిత్ర మాత్రమే కాదు. వర్తమానపు చైతన్యం, భవిష్యత్తు నిర్దేశిత ఆశయం కూడా. అందుకనే మనం అప్పుడపుడయినా మన పూర్వ సమాజ చరిత్రను పరికించాలి. మనకు ముందున్న తరాల జీవనాన్ని, ఆలోచనలను ఆధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం నిలబడిన ఉనికి ఆధారం ఏమిటో బోధపడుతుంది.ఏ త్యాగాల నీడలో సేద తీరుతున్నామో తెలిసి వస్తుంది. అట్లా తెలుసుకోవడానికి ‘ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథ’లన్నింటినీ కొన్ని సంవత్సరాలుగా శ్రమించి, ఏరికూర్చిన చైతన్యపు సంపుటి ‘ఆఖరియోధులు’ అనే పుస్తకం. దీనిని ప్రముఖ ప్రజాపాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ ‘లాస్ట్‌ హీరోస్‌’ అనే పేరుతో ఇంగ్లీషులో డెబ్బయి ఐదేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా బహుమతిగా మనకు అందించారు. అది మనకిప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి రావడటం ఒక గొప్ప అవకాశం. మొన్ననే మనం 76యేండ్లు పూర్తి చేసుకున్న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాము. స్వాతంత్య్రమంటే ఏమిటని నిర్వచించు కుంటున్నాం మనం.దీనికోసం ఎన్నివందల ఏండ్లుగా పోరాడాము, ఎన్ని త్యాగాలు చేశాము. చరిత్రకెక్క కుండా చేసిన త్యాగలెన్నీ- ఇవన్నీ ఇప్పటి తరానికి పట్టని విషయాలుగా మారిపోయాయి. అది మాత్రమే కాదు.చరిత్రను,చరిత్రలో ప్రజలు, నాయకులు నిర్వహించిన పాత్రనూ పూర్తిగా కనుమరుగు చేస్తూ వక్రీకరణకు పాల్పడుతున్న సందర్భంగా ఈ చైతన్య పూరిత చరిత్రపుటలు మనల్ని మేల్కోల్పుతాయి. మనగతంగతంలోని అభిమతం తెలుసు కోకుండా గమనం సరిగా కొనసాగదు. భవిష్యత్తునూ కలగనలేము.గొప్ప ప్రేరణను, భవిష్యత్తు పట్ల ఆశనూ రేకెత్తించే ఉద్విగపూరిత రచన ఇది. ‘మేము స్వేచ్ఛా,స్వాతంత్య్రాలు అన్న రెండు లక్ష్యాలతో పోరాడాము.స్వాతంత్య్రం మాత్రమే సాధించాం.స్వేచ్ఛనింకా పొంద వలసే వున్నది..అది కూడా ఈనాడు కొద్దిమంది చేతుల్లో గుత్తసొమ్ముగా మారింది’ అని మహారాష్ట్రకు చెందిన కెప్టెన్‌ భావు రామచంద్ర శ్రీపతిలాడ్‌,ఆనాడు బ్రిటీష్‌ పరిపాలనకు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపిన తుఫాన్‌సేన సభ్యుడు చెప్పిన మాటల్లాంటి అనేక మంది యోధుల భావాలను రికార్డు చేసిన పుస్తకమిది. విప్లవవీరుడు భగత్సింగ్‌ మేనల్లుడు ప్రొఫెసర్‌ జగ్మోహన్‌ ఈ చరిత్ర గ్రంథానికి ముందుమాట రాస్తూ…’ఆ కాలంతో పోరాటాలు నడిపి,ఇప్పటికీ బతికి వున్న కొద్దిమంది చెప్పే గాథలను తెలుసు కోవడం కంటే ఉత్తేజ భరితం ఏముంటుంది? విచారించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు యువతరం స్వాతంత్య్ర ఉద్యమ సంస్కృతి నుండి వేగంగా దూరమవుతోంది. వారికి సమాజ వికాసానికి తోడ్పడే సామాజిక విలువల గురించి తెలవదు. ఎవరూ చెప్పలేదు.కానీ ఇప్పుడు మరీ వక్రీకరణకు గురవుతోంది’ అని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితిలో ఈ పుస్తకం ఓ కాంతిరేఖ. భారతదేశంలో బ్రిటీష్‌ పాలనవల్ల ఏర్పడిన కరువులు,దారిద్య్రాలు,వ్యాధుల వల్ల అమెరికా, కెనడా వంటి ప్రాంతాలకు వలసెల్లిన వారు, ఇండియాలో తమ సోదరులు అనుభవిస్తున్న కష్టాల గురించి , బానిసత్వం గురించి తెలుసుకుని 1914 ప్రాంతంలోనే దేశానికొచ్చి గదర్‌ తిరుగుబాటు దారులుగా పాల్గొన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. వాళ్లేమి గుర్తింపు కోసం పనిచేయలేదు. ఒరిస్సాలో ఆదివాసీ మహిళలు ‘సాలిహాన్‌’ కానీ , దేమతిదేరు సబర్‌ సాలిహాన్‌ కానీ హౌసాబాయి పాటిల్‌ కానీ తెలంగాణ వీరనారి మల్లు స్వరాజ్యం కానీ,తమిళనాడులోని శంకరయ్య,ఒడిషా లక్ష్మీపాండా, బెంగళూరు దొరెస్వామి, పాండిచ్చేరి నల్లకణ్ణు,బాజీ మహమ్మద్‌, పురూలియా భబానిమెహతో… ఇంకా ఎందరెందరో చరిత్రకెక్కని యోధులు ఏ రకమైన గుర్తింపుల కోసం పాకులాడ కుండా ఉద్యమానికి జీవితాలను ధారపోసినవారే. 2018లో రైతులు చేసిన పోరాటాన్ని చూసి గొంతుకలిపిన వాళ్లే.సాధించిన స్వాతంత్య్రం ప్రజలను ఇంత దారుణంగా చూస్తున్నందుకు పోరు సాగించాలని ప్రేరణ నిచ్చినవారే. అట్లాంటి వీరుల ఉద్వేగపూరిత చరిత్ర.ప్రభుత్వ నిబంధనల, నిర్వచనాల ప్రకారం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించబడని వాళ్లను గుర్తించిన పుస్తక మిది. ఏ ఒక్కరో, కొందరో చేస్తే వచ్చిన స్వతంత్రం కాదిది.
Show all...
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Show all...
కొత్త బంగారు లోకం.pdf5.46 KB
#మన_హైందవ_రాజ్యం అంటే ఏమిటి? మనం ఇక్కడికెలా చేరుకున్నాం?? ఇంగ్లీషు మూలం : ఆకార్ పటేల్ తెలుగు సంపాదకుడు : ఎ. గాంధీ #ధర_రూ300 #కాపీకోసం 094900 98654 అధిక సంఖ్యాకుల ఆధిపత్యం అనేది ఒక జబ్బు. ఇది మన ఉపఖండంలో దేశాలన్నిటికీ సోకింది. అందుకు మినహాయింపుగా ఉంటుందనుకొన్న భారత్ కూడా క్రమంగా ఆ జబ్బుకు లోనైంది. రాను రాను అది మతతత్వ రూపంలో దేశాన్ని ఆవహించి కుంగదీస్తోంది. భారత పాకిస్తానులు రెండూ రెండు విభిన్న మార్గాల్లో ఈ దుస్థితికి చేరుకొన్నాయి. పాకిస్తాను ముందే ఇస్లామిక్ రాజ్యంగా మొదలయింది. అయితే,జిన్నా,లియాఖత్ ఆలీ లాంటి తొలి నాయకులు మత మైనారిటీల హక్కులు తొలగించాలని భావించలేదు. వారికి మత స్వేచ్చతో సహా పూర్తిగా సమాన హక్కులుంటాయని హామీ ఇచ్చారు. ఇస్లామిక్ సూత్రాలూ వగైరాలతో వారికి సంబంధం లేదనీ అవి కేవలం ముస్లిములకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. దేశ భౌతిక సంపదలను పెంచడం ఎంత అవసరమో, దాని ఆత్మిక సంపదను పెంచడం అంతకంటే ఎక్కువ అవసరమని భావించారు. అధిక సంఖ్యలో ఉన్న ముస్లిములు తమ ఆత్మ సంపదనూ దేశ ఔన్నత్యాన్నీ ఇస్లాం సాయంతో సాధించ గలరు అని వారు నమ్మారు.కాని ఆచరణలో పాకిస్తానులో మత ఔన్నత్యమన్నది మాయమయింది. అది ఒక మత పిచ్చి దేశంగా దిగజారిపోయింది. రాజ్యంతో మతాన్ని మిళితం చేస్తే ప్రజలూ దేశమూ పవిత్రమవుతాయి అనుకోవడమే ప్రమాదకరమైన భ్రమ.ఇది దాదాపు ఒక సార్వత్రిక సూత్రం. పాకిస్తాను కూడా దాన్ని మరోసారి రుజువుచేసింది.చరిత్రలో మతాన్ని ఆశ్రయించిన దేశమేదీ ఇంతవరకూ బాగుపడలేదు. భారత్ అలాకాక,ఎటువంటి మత ప్రస్తావన లేకుండా కుల మత ప్రాంతీయ,లింగ వివక్షలు లేకుండా తన పయనాన్ని ప్రారంభించింది. కనీసం రాజ్యాంగ పరంగా. కాని అంతిమంగా మనం కూడా పాకిస్తాన్ చేరిన చోటుకే చేరుకొన్నాం.అది ఎలా జరిగింది? ఇది హిందూ ఔన్యత్యమా, లేదా భారత తిరోగమనమా? తన తొలి అడుగుల్లో మత నిరపేక్ష రాజ్యాంగాన్ని రూపొందించుకొన్న స్వతంత్ర భారత్ చివరికి,అధిక సంఖ్యాక మతాధిపత్యాన్ని ఎలా వాటేసుకొంది? రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన శాసన కర్తలు, అధికార,ప్రతిపక్ష పార్టీలు,కోర్టులు ఈ క్రమంలో నిర్వహించిన పాత్ర ఏమిటి? కాంగ్రెసు పార్టీ ముస్లిములను బాగా గారాబం చేస్తోందన్నది, హిందూత్వ ఆరోపణ.ఈ గారాబపు ముద్దు బిడ్డలు మన పుణ్యభూమిలో అనుభవిస్తున్న వైభవం ఏమిటి? భారత దేశం లౌకిక విలువలను వదిలేసి మతతత్వానికి దిగజారుతున్న దృశ్యం రాను రాను మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో, దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెసు పార్టీ పాపం ఎంత? దానికి హిందూత్వ శక్తులు జోడించింది ఎంత? ఈ ప్రశ్నలకు నిరావేశంగా వస్తుగతంగా ఓపిగ్గా సమాధానం చెప్పడానికి యత్నించింది ఆకార్ పటేల్ పుస్తకం. అది గత ఏడాది వెలువడిన "OUR HINDU RASHTRA". అనేక చారిత్రికాంశాలనూ, మరపున బడిన వాస్తవాలనూ,కోర్టు తీర్పులనూ, గుర్తుచేసింది. కాంగ్రెసు నిర్వాకాన్నీ, హిందూత్వ ఘన కార్యాలనూ, దేశ విభజన నాటి నుండి నేటి వరకూ జరిగిన పరిణామాలనూ మన ముందుంచింది. ✍️ఎ. గాంధీ సంపాదకుడు పీకాక్ క్లాసిక్స్ హైదరాబాద్
Show all...
బాలసాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయేది "చిన్నోడికి ప్రేమతో " ----------- ✍️వేంపల్లె షరీఫ్‌ #కాపీ_కోసం: 094900 98654 #ధర_రూ250(పోస్టేజ్ తో) పిల్లల్ని పెంచడం ఇవ్వాళ పెద్ద సవాలు. ఎంత చదువుకున్నవారైనా, మేధావులైనా పిల్లల్ని పెంచడం దగ్గర బోల్తా కొడుతున్నారు. నిత్యం పిల్లలతో అంటిపెట్టుకుని వాళ్లకు మంచి చెడులు చెప్పే ఓపిక, తీరిక చాలామందికి ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా పిల్లలు తాము చెప్పింది వినడం లేదని పైగా తిరగబడు తున్నారని తీసుకెళ్లి హాస్టళ్లలో వేస్తున్నారు. హాస్టల్స్‌ కూడా ఇవ్వాళ అన్ని రకాల సౌకర్యాలతో చాలా ఖరీదైనవిగా తయారయ్యాయి. పిల్లల్ని పూర్తిగా ఎయిర్‌ కండిషన్‌లో ఉంచి టయానికింత పౌష్టికమైన తిండి పెడుతూ, ఆట-పాటలు, ఆరోగ్యంతో పాటు చదువునూ నేర్పిస్తూ ఆధునిక ఆవాసాలుగా మారుతున్నాయి. పిల్లలు సైతం కొన్నాళ్లపాటు తమ సొంతిళ్లు ఇవేనేమో అని భ్రాంతి చెందే స్థాయిలో తల్లిదండ్రులకు దూరంగా ఉండిపోతున్నారు. ఇలాంటి పిల్లలు ఎక్కువమందిలో పాఠ్యపుస్తకాల జ్ఞానం తప్ప లౌకిక జ్ఞానం ఉండటం లేదు.అయితే తల్లిదండ్రులకు ఇదేమీ పట్టడం లేదు. ర్యాంకులు, మార్కులు తప్ప వాళ్లేమీ చూసే దశలో లేరు. వాళ్ల పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడి ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించే యంత్రాలుగా మారుతున్నారా.. లేదా.. అన్నది ఒక్కటే లెక్కగా ఉంటోంది. ఇలాంటి సందర్భంలో ‘చిన్నోడికి ప్రేమతో..’ అనే ఇలాంటి ఒక ఉత్తరాల పుస్తకం కనబడ్డం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ పిల్లల పట్ల బెంగను పెంచుతుంది. హాస్టల్‌లో ఉన్న పిల్లాడి పట్ల ఆప్యాయతతో వారానికి ఒకటి చొప్పున ఏకంగా ఆరేళ్ల పాటు తల్లి రాసిన ఈ ఉత్తరాల్లో కొన్ని విషయాలు కళ్లను తడిచేస్తాయి.ఒకసారి కాకపోయినా మరోసారి ఈ విషయాల్లో కొన్నింటినైనా తమ పిల్లలకు ఏదో ఒక సందర్భంలో తాము చెబుతున్నామా.. అని తమను తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి. చుట్టూ గందరగోళ వాతావరణం ఉంది. పిల్లల్ని పెంచడం అనే సంగతి అలా ఉంచండి.. అసలు మనిషికే తానెలా బతకాలో తెలియడం లేదు.ఉత్తుత్తి ప్రచారాల హౌరులో ఏది మంచో ఏది చెడో తెలియక అందరూ గందరగోళంలో ఉన్నారు. ఇది ఒక అయోమయాల యుగం. ఈ సమయంలో పిల్లలకు దగ్గరుండి ఇంత సరైన జ్ఞానం ఇవ్వడానికి మించిన బృహత్తర కార్యక్రమం తల్లిదండ్రులకు ఏముంటుంది? కారణాలు ఏవో తెలీదు. పిల్లాడిని హాస్టల్‌లో చేర్చాలి. చేర్చింది. తాను వృత్తిరీత్యా డాక్టరు. నిత్యం బిజీ.ఎంత పనిలో ఉన్నా పిల్లాడి పెంపకం పట్ల బెంగ. కానీ ఏం చేయగలదు. ఇలాంటి పరిస్థితిలో తానేం చేయగలదో ఈ పుస్తకంలోని ఉత్తరాల ద్వారా నిరూపించారు రచయిత్రి డా. ఎ. విజయలక్ష్మి. నిజానికి దూరంగా ఉన్న పిల్లలకు పెద్దలు పలు సుద్దులతో ఉత్తరాలు రాసే ప్రక్రియ అంత కొత్తేమీ కాదు. గతంలో మనకు జైలు నుంచి కూతురు ఇందిరకు ఉత్తరాలు రాసిన నెహ్రూ గురించి తెలుసు. అలాగే అబ్రహం లింకన్‌ రాసిన ఉత్తరాల గురించి తెలుసు. అయితే ఆ ప్రక్రియను ఇలా సమర్థవంతంగా ఇప్పుడిలా ఈ ఆధునిక యుగంలో ఉపయోగించు కోవచ్చని తెలియడంలోనే రచయిత్రి విజయం ఉంది. సెల్‌ఫోన్లు వచ్చాయి.వాయిస్‌ రికార్డులు వచ్చాయి. వాట్సప్‌ మెసేజులు,మెయిల్స్‌ వచ్చాయి. కమ్యూనికేషన్‌ రంగంలో ఎంత విప్లవం వచ్చినా ఇలాంటి సందర్భంలో దూరంగా ఉన్న పిల్లాడికి ఒక తల్లి రాసే ఉత్తరం ఇచ్చే హాయి ఇంకోటి ఏదీ ఇవ్వలేదని నిరూపిస్తుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం ఇటు పిల్లలకు జ్ఞానాన్ని, పెద్దలకు కర్తవ్యనిర్దేశాన్ని ఇవ్వడమే కాదు అటు బాలసాహిత్యానికి కూడా చాలా ఉపకారం చేసింది. ఇవ్వాళ చూపిద్దామంటే పిల్లలకు తెలుగులో ఒక మంచి సినిమా ఉండటం లేదు. చదివిద్దామంటే పంచతంత్రం, తెనాలి రామకృష్ణ, ఈసఫ్‌ కథలు వంటి వాటి దగ్గరే ఆగిపోవాల్సి వస్తోంది. ఈ తరం పిల్లల ఆసక్తికి, ఆలోచనకు తగ్గట్టు సరైన తర్కంతో, సందర్భానుసారం కర్తవ్య బోధ చేసే సాహిత్య సృజన జరగడం లేదు. ఆ లోటును ఈ పుస్తకం తీరుస్తుంది. హాయ్ చిన్నూ, హాయ్ బంగారం, హాయ్ చిన్నోడా, హాయ్ చిన్నులూ అంటూ మొదలయ్యే ఉత్తరాలన్నీ కేవలం నాలుగైదు పేరాలతో చాలా సరళమైన భాషలో, అవసరమైన పదాలతో, అవసరమైన విషయాలను, అవసరమైనంత వరకే చెప్పి ముగుస్తాయి. చివర్లో ‘ప్రేమతో.. అమ్మ’ అని చదవడంతోనే అక్షరాల నిండా అమ్మతనం పరుచుకుని మనసు పరిమళిస్తుంది. పుస్తకంలో రచయిత్రి కొడుకు చిన్నూకే కాదు ఎవరు చదివినా వారికి తమ అమ్మ గుర్తుకొస్తుంది. ఈ పుస్తకం బాలసాహిత్యంలో గొంతెండుతున్న మనుషులకు ఒక నీటి చుక్క జాడ చెప్పడం వంటిది.జహీరాబాద్‌లో డాక్టర్‌గా ఉంటూ తమ పిల్లాడితోపాటు ఇతర పిల్లల కోసం కూడా నిరంతరం సారస్వత, వైజ్ఞానిక రంగాల్లో కృషి చేస్తున్న డా. ఏ. విజయలక్ష్మి అభినందనీయురాలు.
Show all...
ఇవీ మన మూలాలు! -కల్లూరి భాస్కరం (పుస్తక పరిచయ వీడియోలు కింద లికుల్లో ఉన్నాయి.) #కాపీకోసం_9490098654 #ధర_450రూ మానవ ప్రస్థానం గురించీ, మరీ ముఖ్యంగా “మన” మూలాల గురించీ తెలుగులో ఒక సాధికారిక గ్రంథంగా ఇటీవల విడుదలైన కల్లూరి భాస్కరం గారి “ఇవీ మన మూలాలు” ఎందుకు చదవాలో చెప్పేముందు వారి మాటలు వినండి. “మన విశ్వాసాలూ, ఇష్టా ఇష్టాలూ, రాజకీయ అవసరాలదీ కాకుండా, శాస్త్ర పరిశోధనల్లో జ్ఞానానిది పైచేయి అయినంత వరకూ; ఆ పరిశోధన క్రమంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా, వాటిని తెరచిన బుద్ధితో ఆహ్వానించడమే మనం చేయగలిగిందీ, చేయవలసిందీ…” “ఒక్క మనదేశానికి మాత్రమే పరిమితమై చెప్పుకుంటే, జన్యు పరిశోధనలు భారత్ లోకి ఆర్య ఇండో- యూరోపియన్ జనాల వలసను స్పష్టీకరించిన దరిమిలా,జనం సెంటిమెంటును వాడుకునే రాజకీయానికీ, జ్ఞాన రంగానికీ మధ్య ఒక అసమ యుద్ధం ముమ్మరమైంది. ధర్మ పోరాటంలో తాను ఓడిపోతున్న పరిస్థితుల్లో రాజకీయం తమకు కలిసివచ్చే మేధావులూ, మీడియా సాయంతో అసత్యాలూ, అర్థసత్యాలూ వక్రీకరణలే ఆయుధాలుగా అధర్మ పోరాటానికి దిగింది. అంతకన్నా కూడా అసలా చర్చ మీదే తెరదించేసి వ్యూహాత్మక మౌనం పాటించడమే మంచిదని కూడా క్రమంగా భావించినట్లు కనిపిస్తోంది.” నిజానికి కల్లూరి భాస్కరం గారి ఈ వాక్యాలే ఈ పుస్తకానికి ఆలంబన. పుస్తక పరిచయ వీడియోలు 1. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన జాతి అంటూ ఏదీ లేదు. - విఠపు బాలసుబ్రమణ్యం మాజీ ఏంఎల్సీ https://youtu.be/N0QtE1L1GNs?si=IQKCLGNk0tHna6qe 2. ఒక బుక్ షెల్ఫ్ మొత్తం చదివినట్లుంటుందీ పుస్తకం - డాక్టర్ ఎ.సత్యనారాయణ ప్రసాద్ MS https://youtu.be/42pVHbr-Z0s?si=s8PY8P0giP7Drfpn 3. స్వచ్ఛమైన జాతి అంటూ ఏదీ లేదు.ఎప్పుడో సంకరమైపోయింది. - జస్టిస్ బి.సుదర్శన రెడ్డి https://youtu.be/0DIzyOctQyk?si=ZstBucDltBWQRL8k 4. రామాయణాన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు అల్లరి మూకలకు ఆయుధం అయ్యింది. - వాడ్రేవు చిన వీరభద్రుడు https://youtu.be/3JR9qq998A0?si=jMFUFhY1_T0wLsRJ 5. పుస్తకంలో పాత్రలు,సన్నివేశాలు,ప్రాంతాలు అన్ని మనని ఉద్దేశించినవే. - శ్రీశైలరెడ్డి పి https://youtu.be/zxxjo719tNs?si=6kIdNyS8VtbulVhK 6. ఈ పుస్తకం మనల్ని అగ్నిలా వెంటాడుతుంది - కుప్పిలి పద్మ https://youtu.be/7pFd6P5pW-4?si=N1zFqAG82oGwxdgp 7. ఇప్పుడు పాటిస్తున్న ఆచారాల మూలం ఆర్య వలసల్లో ఉంది - బిపి పడాల https://youtu.be/o69oOnKcHhA?si=a64MGBmPhV2At6rD 8.ఇలాంటి పుస్తకం రాయాలంటే దమ్ముండాలి - సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ https://youtu.be/iU-Fpn8t3jw?si=AboYvSFS98YkY3J- 9. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరూ అనేవారికి ఈ పుస్తకం సమాధానం - సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి https://youtu.be/oYgggjkMG2s?si=JHm7DqdV3wmz6Kp2 10. ఒకసారి చదివితే అర్థం అయ్యే పుస్తకం కాదు - జగదీశ్వరరెడ్డి https://youtu.be/gBJGu4cQh34?si=qDlm5yeBpoM7GcFW
Show all...
విఠపు బాలసుబ్రమణ్యం ex mlc about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam

#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page

https://www.facebook.com/profile.php?id=100068541430598

Editor - Seshu korlapati

Show all...
Discussion on Book || Twilight Prisoners || Siddartha Deb || Live || 5-8-24

#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page

https://www.facebook.com/profile.php?id=100068541430598

Editor - Seshu korlapati

Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.